ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్​ దిగ్గజం సిటీ బ్యాంక్​ సంచలన నిర్ణయం

 


అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్​ దిగ్గజం సిటీ బ్యాంక్​ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​తో సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్​ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, సిటీ బ్యాంక్ కన్స్యూమర్ వ్యాపార విభాగం కింద​ ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, హోమ్​ లోన్స్​, వెల్త్​ మేనేజ్​మెంట్​ వంటి సేవలందిస్తుంది. ప్రస్తుతం సిటీ బ్యాంకుకు దేశ వ్యాప్తంగా 35 శాఖలు ఉన్నాయి. కన్స్యూమర్​ బ్యాంకింగ్ వ్యాపారంలో సుమారు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంపై సిటీ బ్యాంక్ గ్లోబల్​ సీఈఓ జేన్​ ఫ్రేజర్​ మాట్లాడుతూ ''భారత్​ సహా 13 దేశాల్లో కన్స్యూమర్​ బ్యాంకింగ్ వ్యాపారాల నుండి వైదొలగాలని నిర్ణయించాం. ఈ మార్కెట్లలో తమ బ్యాంక్​ ఇతర బ్యాంకులతో పోటీపడలేకపోతుండటమే వైదొలగడానికి ముఖ్య కారణం.' అని ఆయన స్పష్టం చేశారు.


కాగా, సిటీ బ్యాంక్​ ఈ వ్యాపారం నుంచి ఎలా వైదొలగనుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కన్స్యూమర్​ బ్యాంకింగ్​ సేవల నుంచి తప్పుకోవాలంటే ఖచ్చితంగా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఆమోదమూ అవసరమవుతుంది. అందువల్ల, ఆర్​బీఐ నుంచి గ్రీన్​ సిగ్నల్​ వచ్చే వరకు యథావిధిగా తమ సేవలు అందించనున్నట్లు సిటీ బ్యాంక్​ ఇండియా చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆశు ఖుల్లార్​ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "తాజా ప్రకటనతో ప్రస్తుతానికైతే మా కార్యకలాపాల్లో తక్షణ మార్పులేమీ ఉండవు. అలాగే మా ఉద్యోగులపైనా దీని ప్రభావం ప్రభావం ఉండదు. కన్స్యూమర్​ సేవల నుంచి వైదొలిగేందుకు ఆర్​బీఐ నుంచి గ్రీన్​సిగ్నల్ వచ్చే వరకు మా కస్టమర్లకు అదే అంకితభావం, శ్రద్ధతో మెరుగైన సేవలు