'జగనన్న విద్యా కానుక' కిట్ల సరఫరా అస్తవ్యస్తం

 


చాలీచాలని బూట్లు.. చినిగిన బ్యాగ్‌లు

నెల్లూరు జిల్లాలో చాలామంది పిల్లలకు


రెండూ ఎడమ కాలి బూట్లు అందజేత


నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయం లేదు


యూనిఫాం క్లాత్‌ సరఫరాలోనూ చేతివాటం


ఒక్కొక్కరికి 3 జతలు అని చెప్పిన ప్రభుత్వం


అధిక శాతం మందికి వచ్చింది రెండు జతలే


అదీ నాసిరకం వస్త్రం ఇచ్చారని విమర్శలు


జత కుట్టు కూలిగా కేవలం రూ.40 మాత్రమే


వస్తువుల వాడకానికి దూరంగా విద్యార్థులు


జిల్లాకేంద్రాలు, స్కూళ్లలో గుట్టలుగా నిల్వలు
'జగనన్న విద్యా కానుక' కిట్ల సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు కొన్ని జిల్లాల్లో 75శాతం వరకు సరఫరా కాగా పలు జిల్లాల్లో చాలామంది విద్యార్థులకు చాలీచాలని బూట్లు, చినిగిపోయిన, జిప్పులు లేని బ్యాగ్‌లే అందాయి. నెల్లూరు జిల్లాలో అధికశాతం పిల్లలకు ఎడమ కాలి షూ జత పంపించారు. వినియోగానికి పనికిరాని వాటిని వెనక్కి తీసుకుని ప్రత్యామ్నాయ వస్తువులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు.


నెలలు గడుస్తున్నా వాటిని మార్చి కొత్తవి ఇచ్చే అంశాన్ని సమగ్ర శిక్ష గత ఎస్‌పీడీ చినవీరభద్రుడు, ఏఎ్‌సపీడీ మధుసూదన్‌రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలలు, సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయాల్లో(అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌) పెద్ద సంఖ్యలో వస్తువులు గుట్టలుగా పడి ఉన్నాయి. మరికొన్ని పిల్లల దగ్గరే ఉన్నాయి. సరిపోని బూట్లు, చినిగిన బ్యాగ్‌లను వారు వినియోగించడం లేదు. అవి లేకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. అసమగ్రంగా, నిరుపయోగంగా ఉన్న ఆ వస్తువులను చాలాచోట్ల ప్రధానోపాధ్యాయుల నుంచి వెనక్కి తీసుకోనే లేదు. వేలాది పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు ఇప్పటికీ సరఫరా చేయలేదని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలకు చెందిన 43 లక్షల మంది పిల్లలకు 3జతల యూనిఫాం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సింహభాగం విద్యార్థులకు 2జతలకు సరిపడా వస్త్రాన్ని అందించారు. కొంచం బొద్దుగా ఉన్న పిల్లలకు అది ఒక జతకే సరిపోతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3 జతల యూనిఫాం ఎందుకు ఇవ్వలేదో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు. సరఫరా చేసిన వస్త్రం కూడా నాసిరకంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. జత కుట్టుకూలి కింద రూ.40 మాత్రమే ఇచ్చారు.


బూట్ల తరలింపునకు ఎత్తుగడ