వరుస పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫుల్‌స్టాప్‌

 


వరుస పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తొలి విజయాన్ని అందుకుంది. ఇక్కడి చెపాక్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్‌ ఖాన్‌ (17 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.


ఖలీల్‌ అహ్మద్‌ (3/21), అభిషేక్‌ శర్మ (2/24) బంతితో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 121 పరుగులు చేసి సీజన్‌లో బోణీ కొట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (56 బంతుల్లో 63 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... వార్నర్‌ (37 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించిన హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అతడు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.