బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా.... కోవర్ట్‌ ఆపరేషన్‌ ప్లాన్‌

 


ఏజెంట్‌గా ఓ కోవర్ట్‌ ఆపరేషన్‌ ప్లాన్‌ చేశారు బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా. ఈ ఆపరేషన్‌ త్వరలోనే స్టార్ట్‌ కానుంది. దర్శకుడు రిబుదాస్‌ గుప్తా, హీరోయిన్‌ పరిణీతి చోప్రా కాంబినేషన్‌లో ‘ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన ఈ సినిమాకు వ్యూయర్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా పరిణీతి, రిబు కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని బాలీవుడ్‌ తాజా సమాచారం.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పరిణీతి ఎన్‌ఐఏ ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారట. ఓ కోవర్ట్‌ ఆపరేషన్‌తో దోషులను చట్టానికి అప్పగిస్తారట. మరి... ఈ ఆపరేషన్‌ను పరిణీతి ఎలా డీల్‌ చేశారన్నది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.