ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సమీక్ష

 


ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో స్థానిక పరిపాలన అధికారులు, వైద్యులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ట్వీట్‌ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంతో సహా ఉత్తరప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. వైరస్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం 7 గంటల వరకు.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మే 15 వరకు వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది.


ఇదిలా ఉండగా.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి సందర్శించాలనుకునే భక్తులకు తమ పర్యటనను రద్దు చేసుకోవాలని ఇటీవల అధికారులు సూచించిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక నగరంలో గత రెండు వారాల నుంచి పెద్ద ఎత్తున కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలనుకునే స్వదేశీ, విదేశీ భక్తులు పర్యటనను రద్దు చేసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ కోరారు.