గరుడ సర్కిల్‌ దగ్గర లోకేష్‌ ప్రమాణం

 


టీడీపీ నేత నారా లోకేష్‌ అలిపిరి చేరుకున్నారు. గరుడ సర్కిల్‌ దగ్గర లోకేష్‌ ప్రమాణం చేయనున్నారు. వైఎస్ వివేకా హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానని ఆయన ప్రకటించారు. జగన్‌రెడ్డి కూడా ప్రమాణం చేయాలని లోకేష్‌ సవాల్‌ విసిరారు. కత్తితో బతికేవాడు కత్తికే చస్తాడన్నారు. జగన్‌రెడ్డి ఇక్కడికి ఎందుకు రావడం లేదు?, దైవసాక్షిగా ప్రమాణం చేసేందుకు ఎందుకు భయపడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌రెడ్డి తన ఇంటి నుంచి 45 నిమిషాల్లో ఇక్కడికి రావొచ్చన్నారు.