భారతదేశం గర్వించదగిన దర్శకుల్లో మణిరత్నం

 


భారతదేశం గర్వించదగిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఈయన ప్రస్తుతం భారీ తారాగణంలో 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇదిలావుంటే, గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల్లో 'దళపతి', 'రోజా','బొంబాయి'తో సహా మొత్తం 26చిత్రాలున్నాయి.ఇపుడు ఈ చిత్రాలన్నీ డిజిటలైజేషన్‌ కానున్నాయి.ఈ బృహత్తర ప్రాజెక్టును ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌తో పాటు ప్రసాద్‌ స్టూడియో చేపట్టింది. ఈ చిత్రాల డిజిటలైజేషన్‌ పనులు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.