భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రం

 


భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రం అవుతున్నది. దీంతో దేశంలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారిపోయాయి. రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, భారత్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా భారీ సహాయం ప్రకటించింది. 100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్ ను ఇండియాకు పంపేందుకు అంగీకరించింది. ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నాయి. వీటితో పాటుగా అస్త్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు పంపుతోంది అమెరికా.