భారీగా రద్దీ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్‌, మే మధ్య అదనపు రైళ్లుభారీగా రద్దీ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్‌, మే మధ్య అదనపు రైళ్లు నడిపేందుకు రైల్వే సిద్ధమైంది. గోరఖ్‌పూర్‌, పాట్నా, ముజఫర్‌పూర్‌, వారణాసి, గౌహతి, ప్రయాగ్‌రాజ్‌, లక్నో, బరౌని, కోల్‌కతా, దర్భంగా, భాగల్‌పూర్‌, మాండూవాడి, రాంచీ తదితర ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు, 674 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ సునీత్‌ శర్మ తెలిపారు. ఇందులో 101 ముంబై నుంచి, 21 రైళ్లు ఢిల్లీ ప్రాంతం నుంచి నడువనున్నాయి. దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నా అదనంగా రద్దీ లేకున్నా.. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.