కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా, సీరియల్స్ షూటింగ్స్ నిలిపివేత

 


మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఫిల్మ్, టీవీ సీరియల్స్, యాడ్ షూటింగులను నిలిపివేశారు. కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నుంచి మహారాష్ట్రలో సినిమాలు, టీవీ సీరియల్స్, యాడ్స్ షూటింగులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు బుధవారం రాత్రి 8గంటల నుంచి మే 1వతేదీ ఉదయం 7గంటల వరకు కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తారు.