శాంసంగ్‌ నుండి మరో రెండు కొత్త ఫోన్లు లాంచ్‌ .‌

 


సౌత్‌ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ మరో రెండు కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఎఫ్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్ 12, గెలాక్సీ ఎఫ్ 02ఎస్‌ మోడళ్లను భారత్‌లో ఆవిష్కరించింది. ఎఫ్‌ సిరీస్‌లో కంపెనీ ఇప్పటికే గెలాక్సీ ఎఫ్‌62ను విడుదల చేసింది. 48ఎంపీ క్వాడ్‌ కెమెరా సెటప్‌, 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6,000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు గెలాక్సీ ఎఫ్‌12లో ఉన్నాయి. గెలాక్సీ F02sలో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే, 5,000 mAh బ్యాటరీ ప్రత్యేకతలు ఉన్నాయి. F12, F02s ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. భారత్‌లో గెలాక్సీ ఎఫ్ 02ఎస్‌ ధర రూ.8,999 కాగా, గెలాక్సీ ఎఫ్ 12 ప్రారంభ ధర రూ. 10,999గా నిర్ణయించారు