ఇండోనేషియాను వణికిస్తున్న వరదలు.

 


ఇండోనేషియాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని ఈస్ట్ తైమూర్‌లో వరదలు పోటెత్తడంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా.. చాలామంది గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సోమవారం వరకూ మృతుల సంఖ్య 87కి పెరిగింది. ఇండోనేషియా తూర్పు తైమూర్ వరకు విస్తరించి ఉన్న ద్వీపాల్లో వరదలు అకస్మాత్తుగా విధ్వంసం సృష్టించాయి. దీంతోపాటు కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో చాలామంది జాడ తెలియడంలేదని ఇండోనేషియా అధికారులు పేర్కొన్నారు. జల ప్రళయం వల్ల ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలన్నీ నీటమునిగాయని.. వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ వరదల వల్ల ఇప్పటివరకూ 66 మంది మరణించారని.. సుమారు 100 మంది వరకూ తప్పిపోయినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ ఏజెన్సీ వెల్లడించింది. అయితే తూర్పు తైమూర్లో 21 మంది మరణించారని పేర్కొంది. ఈ ప్రకృతి వినాశనంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రసంగించారు. విపత్తుల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నామని.. ఆహారం, వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోందని వెల్లడించారు.