పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం ఏడో దశ పోలింగ్‌

 


పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం ఏడో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 34 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 34 స్థానాల పరిధిలో 86లక్షల ఓటర్లు ఉండగా.. 12,068 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో 796 కంపెనీల కేంద్ర బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దశలో మొత్తం 284 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.