రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటీష్ పెట్రోలియం (BP) కలిసి ఏప్రిల్ 26న కీలక ప్రకటన

 


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్రిటీష్ పెట్రోలియం (BP) కలిసి ఏప్రిల్ 26న కీలక ప్రకటన చేశాయి. ఇండియా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న కృష్ణా, గోదావరి (KG) డీ6 బ్లాక్‌లో శాటిలైట్ క్లస్టర్ గ్యాస్ ఫీల్డ్ నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపాయి. "ఈ శాటిలైట్ క్లస్టర్ అనేది... మొత్తం మూడు క్లస్టర్లలో రెండోది. ఇది ఇప్పుడు ప్రారంభమైంది. మొదటి R క్లస్టర్ 2020 డిసెంబర్‌లో మొదలైంది. నిజానికి ఈ రెండో క్లస్టర్ ప్రొడక్షన్... 2021 మధ్యలో ప్రారంభం కావాలని ముందుగా షెడ్యూల్ ఉంది." అని రిల్... బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE) ఫైలింగ్‌లో తెలిపింది. తాజాగా చేసిన ప్రకటన ద్వారా ఈ ఫీల్డ్ వివరాలు తెలిశాయి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్... కాకినాడలో ఉన్న ఆఫ్‌షోర్ టెర్మినల్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భూమిలో సముద్ర నీటిలో... 1,850 మీటర్ల (6069.55 అడుగులు) లోతున ఉంది. ఈ ఫీల్డ్ ద్వారా 4 రిజర్వాయర్ల నుంచి గ్యాస్ ఉత్పత్తి కానుంది. గ్యాస్ ఉత్పత్తి 6 mmscmd వరకూ ఉంటుందని రిల్ తెలిపింది. "R క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్ కలిపి... దేశంలోని గ్యాస్ ఉత్పత్తిలో 20 శాతం కలిగివుంటాయి" అని రిల్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఇక KG D6 బ్లాక్ లోని మూడో డీప్ వాటర్ గ్యాస్ డెవలప్‌మెంట్ - MJ... 2022 మధ్య నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందనే అంచనా ఉంది. రిల్ నిర్వహిస్తున్న KG D6 బ్లాక్‌లో రిల్‌కి 66.67 శాతం పార్టిసిపేటింగ్ ఇంట్రస్ట్ ఉండగా... బీపీకి 33.33 శాతం పార్టిసిపేటింగ్ ఇంట్రస్ట్ ఉంది.