రానున్న జులైలో భారత్ లోకి ola ఎలక్ట్రిక్ స్కూటర్

 


రానున్న జులైలో భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురానున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఇందు కోసం దేశంలోని దాదాపు 400 నగరాల్లో లక్ష ఛార్జింగ్‌ పాయింట్లు సహా 'హైపర్‌ఛార్జర్‌ నెట్‌వర్క్‌'ను ఏర్పాటుకు పనిచేస్తున్నట్లు ఓలా వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి ప్రకటన విడుదలైంది. జులై నెల నుంచి తమ ఎలక్ట్రికల్ స్కూటర్‌ అమ్మకాలు ప్రారంభిస్తామని ఓలా చైర్మన్‌, గ్రూప్‌ సీఈఓ భవిశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి ఏడాదిలో దేశంలోని 100 నగరాల్లో 5 వేలకు పైగా ఛార్జింగ్‌ పాయింట్లను ఓలా ఏర్పాటు చేయనుంది. క్రమ క్రమంగా 400 నగరాల్లో లక్ష పాయింట్లను ఏర్పటు చేయనుంది సంస్థ. తమిళనాడు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ జూన్‌ కల్లా సిద్ధం కానునున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రారంభంలో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 లక్షల యూనిట్లుగా ఉండనుంది. అయితే రానున్న 12 నెలల్లో తయారీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని ఓలా వివరించింది. ఇదిలా ఉంటే భారత్ లో ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు తగ్గుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాహనాలు అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. మొత్తం 2,36,802 వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,95,693గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.