సముద్రతీర జిల్లాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో ఎండ తీవ్ర

 


 సముద్రతీర జిల్లాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో ఎండ తీవ్రత పెరగనున్నట్లు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ పువిఅరసన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో, కర్ణాటక అనుకొని ఉన్న తమిళనాడు ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ ప్రభావంగా వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని, చెన్నై, శివారు ప్రాంతాల్లో ఉష్ణచలనం కారణంగా స్వల్ప వర్షం కురుస్తుందన్నారు. శనివారం సముద్రతీర ప్రాంతాలు మినహా ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందన్నారు. 8 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ కనుమల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే, 11, 12 తేదీల్లో పశ్చిమ, నైరుతి దిశ నుంచి వడగాలులు వీచే అవకాశముండడంతో రాష్ట్ర సముద్రతీర జిల్లాల్లో ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతల కన్నా 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు.