వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 12 బ్యాంకులకు పోలీసులు లేఖ

 


.వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 12 బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. పుట్ట మధు, పుట్ట శైలజ , పుట్టా మధు కొడుకు, కోడలు, కూతురుకు సంబంధించిన అకౌంట్స్ వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు పోలీసుల లేఖ రాశారు. పుట్ట సతీష్, రాయచూర్ శ్రీనివాస్, కుంట శ్రీను, బిట్టు శ్రీనివాస్.. పూదరి సత్యనారాయణలకు అకౌంట్స్ ఉన్న బ్యాంకులకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. న్యాయవాది వామన్‌రావ్ హత్యకు రెండు నెలల ముందు నుంచి.. లావాదేవీల వివరాలు కోరుతూ బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. 5 లక్షలకు మించి లావాదేవీల వివరాలు ఇవ్వాలని పోలీసులు బ్యాంకులను లేఖలో కోరారు. రెండు కోట్ల వ్యహారం తేల్చే పనిలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.