135 మందికి సొంత ఖర్చులతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్

 


ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. దాపు 15 రోజులు తన కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని తన కుటుంబాన్ని చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా తన టీంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సొంత ఖర్చులతో వ్యాక్సిన్ వేయించారు. ఆలా దాదాపు 135 మందికి సొంత ఖర్చులతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేయించారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ మినీ వ్యాక్సిన్ డ్రైవ్ ను పర్సనల్ గా చూసుకున్నారట. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గ నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.