ఫ్యామిలీ మ్యాన్‌ నూతన సీజన్‌ ట్రైలర్‌ను మే 19వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల

 


అత్యంత ఆసక్తికరంగా ఎదరుచూస్తున్న తమ ఒరిజినల్‌ సీరీస్‌, ఫ్యామిలీ మ్యాన్‌ నూతన సీజన్‌ ట్రైలర్‌ను మే 19వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. 2019లో మొదటి సీజన్‌ విడుదలైన తర్వాత అది క్లిఫ్‌హ్యాంగర్‌తో ముగియడంతో అభిమానులు అత్యంత ఆసక్తిగా తరువాత సీజన్‌ కోసం వేచి చూస్తున్నారు. ఫ్యామిలీమ్యాన్‌ తాజా సీజన్‌ ట్రైలర్‌ ఇప్పుడు యూ ట్యూబ్‌ లో నంబర్‌-1గా వరుసగా మూడు రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తద్వారా ఫ్యామిలీ మ్యాన్‌ నూతన సీజన్‌ పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అమితాసక్తిని కనబరుస్తు న్నారని అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌కు ఇప్పటికే భారీ స్థాయిలో 37 మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. ట్రైలర్‌కు లభించిన అపూర్వ స్పందనతో ఫ్యామిలీ మ్యాన్‌ క్రియేటర్లు ఇప్పుడు తమ ఏ-గేమ్‌ను తీసుకురావడంతో పాటుగా బహు భాషా నూతన సీజన్‌తో వీక్షకులను సంభ్రమాశ్చర్యాల కు గురిచేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ట్రైలర్‌కు లభిం చిన అపూర్వ స్పందనతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన ఈ షో క్రియేటర్‌ ద్వయం రాజ్‌-డీకే ఈ షో గురించిన విశేషాలను పంచుకున్నారు.