శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఫ్యాన్‌ ఎడిషన్‌(గెలాక్సీ S20 FE) అంతర్జాతీయ మార్కెట్లో విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఫ్యాన్‌ ఎడిషన్‌(గెలాక్సీ S20 FE)ని

అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 4జీ మోడల్‌ను జర్మనీ, మలేషియా, వియత్నాంల్లో

లాంచ్ చేశారు. కొత్త వేరియంట్‌ 4జీ కనెక్టివిటీని సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గతంలో విడుదల చేసిన ఫోన్లలో శాంసంగ్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌ ఉండగా, కొత్త వేరియంట్లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ను అందించారు.


గెలాక్సీ S20 FE 4G ఫోన్‌ భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోన్‌ ధర సుమారు రూ. 41,000గా ఉండనుంది. బ్లూ, ఆరెంజ్‌, వయలెట్‌ కలర్లలో ఫోన్‌ను రిలీజ్‌ చేశారు. అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌ S20 FE 5G ఫోన్‌ను గతేడాది మార్చిలో భారత్‌లో విడుదల చేశారు. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.55,999గా నిర్ణయించారు.