పాలిసెట్‌-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభం

 


హైదరాబాద్: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 11 వరకు కొనసాగనుంది. రూ.300 ఆలస్య రుసుముతో జూన్‌ 15వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు 040-23222192 కు ఫోన్‌ చేయొచ్చని, వెబ్‌సైట్‌ www.polycetts.nic.in చూడాలని సంబంధిత అధికారులు చెప్పారు.