పిఎం-కిసాన్‌ కింద ఎనిమిదో విడతలో భాగంగా రూ. 20 వేల కోట్లను ప్రధాని మోడీ శుక్రవారం విడుదల

 


ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడతలో భాగంగా రూ. 20 వేల కోట్లను ప్రధాని మోడీ శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం 9.5 కోట్ల మంది అన్నదాతలు ఖాతాల్లో నేరుగా జమకానుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ..ఈ పథకంలో పశ్చిమ బెంగాల్‌ చేరిందని, రాష్ట్రంలో 7 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు. పిఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా 14 కోట్ల మంది రైతులకు మూడు సమాన వాయిదా పద్ధతిలో రూ. 6 వేలను చెల్లిస్తోంది. 2019లో ఫిబ్రవరి 24న ప్రారంభించిన పిఎం-కిసాన్‌ పథకం ఇప్పటి వరకు రూ. 1.15 లక్షల కోట్లను రైతలకు బదిలీ చేయబడ్డాయి.

కరోనా వైరస్‌పై భారత్‌ పోరాడుతున్న తరుణంలో ఈ విడత నిధులు విడుదల చేశామని మోడీ అన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా రైతన్నలు వ్యవసాయంలో రికార్డులు సృష్టించారని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పైైె పంటను సేకరించడంలో కేంద్రం కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్నారు. గతంతో పోలిస్తే...ఎంఎస్‌పిపై 10 శాతం అదనంగా గోధుమలను కొనుగోలు చేశామని తెలిపారు.