ఎనర్జిటిక్ హీరో రామ్‌కి ఇస్మార్ట్ శంకర్ రెండు వందల మిలియన్లు (20 కోట్ల) వ్యూస్‌

 


ఎనర్జిటిక్ హీరో రామ్‌కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఎంత జోష్ అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ముందు హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్న రామ్‌కి పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ దెబ్బకు అటు హీరో,ఇటు డైరెక్టర్ ఇద్దరి కెరీర్‌లు జెట్ స్పీడ్‌లో దూసుకుపోయాయ్. అయితే ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నప్పటికీ హవా ఏ మాత్రం తగ్గలేదు.


టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం నార్త్‌లో మంచి డిమాండ్ ఉంది. తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వర్షెన్‌లు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్నాయి. ఇప్పటికే రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ ఇలాంటి సినిమాలు యూట్యూబ్‌లో దుమ్ములేపేశాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రెండు వందల మిలియన్లు (20 కోట్ల) వ్యూస్‌ను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అలానే రెండు మిలియన్ లైకులను కూడా సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ హవాని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.