పంజాబ్లోని మోగా సమీపంలో గురువారం అర్ధరాత్రి భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో యుద్ద విమానం సాధారణ శిక్షణా దశలో ఉందని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం వెనుక గల కారణాలపై ఐఏఎఫ్ విచారణ నిర్వహించనుంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.