కంపెనీ లాభం రూ. 260 కోట్లకు

 

 గ్లాండ్ ఫార్మా... మంగళవారం నాటి ఇంట్రాడే ప్రారంభంలో రూ. 2,910 వద్ద ఉండగా... మధ్యాహ్నం సమయానికి ఈ కంపెనీ షేరు ధర రూ. 3,125 వరకు పరుగులు పెట్టింది. షేరు ధర రూ. 215 వరకు పెరిగింది. కేవలం నాలుగు గంటల్లోనే ఇంతలా పెరగడం గమనార్హం. గ్లాండ్ ఫార్మా కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఇందులో కంపెనీ లాభం రూ. 260 కోట్లకు చేరింది. నికర లాభంలో 34 శాతం పెరుగుదల నమోదైంది.