జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ 2

 


రెండేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించిన పాపులర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తొలి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇందుకు సీక్వెల్ రూపొందించారు. రెండో పార్ట్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చెన్నై బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించి సౌత్ దృష్టి కూడా ఈ వెబ్ సిరీస్‌పై పడేలా చేశారు.


ఫ్యామిలీ మ్యాన్ 2 ఫిబ్రవరిలోనే విడుదల కావలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి నిన్న ట్రైలర్ విడుదల చేసి జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రిమింగ్ కానున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. విడుదలైన 24 గంటలలో 15 మిలియన్ల వ్యూస్, 500k లైక్స్‌ను సాధించి యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఫ్యామిలీ మ్యాన్ 2తో మీర్జాపూర్ 2 రెండో స్థానానికి పడిపోయింది.