నేపాల్‌లో బుధవారం ఉదయం 5.42 (ఇండియా టైమ్ ప్రకారం) గంటలకు మధ్యస్థాయి భూకంపం

 


నేపాల్‌లో బుధవారం ఉదయం 5.42 (ఇండియా టైమ్ ప్రకారం) గంటలకు మధ్యస్థాయి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైంది. అది రాజధాని ఖాట్మండుకు వాయవ్య దిశలో 113 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. కరెక్టుగా భూకంపం ఎక్కడ వచ్చిందంటే... లామ్‌జంగ్ జిల్లాలో... భూల్‌భులే అనే ప్రాంతంలో వచ్చింది. దాన్నే భూకంప కేంద్రం అంటున్నాం. దాని తీవ్రత 5.3గా తేలింది అని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని సిస్మోలజిస్ట్ డాక్టర్ లోక్‌బిజయ్ అధికారి తెలిపారు. ఈ భూకంపం పెద్దదేమీ కాదు కాబట్టి... ఎవరూ చనిపోలేదు. ఆస్తినష్టం ఏదైనా జరిగిందే ఆనేది తేలాల్సి ఉంది.

ముప్పు పొంచి ఉందా? మన దేశానికి ఉత్తరాన ఉండే నేపాల్‌లో భూకంపం రావడం అనేది మన ఇండియాకి ప్రమాదకర సంకేతం. ఎందుకంటే... కోట్ల సంవత్సరాల కిందట అంటార్కిటికా నుంచి విడిపోయిన ఇండియా... హిందూ మహా సముద్రంలో తేలుతూ... ఆసియా ఖండానికి అతుక్కుపోయింది. అలా అతుక్కునేటప్పుడు... బలంగా ఢీ కొట్టింది. అప్పుడు ఢీ కొట్టిన ప్రాంతంలో... ఆసియా భూమి, ఇండియా భూమి... రెండూ అతుక్కుపోతూ పైకి లేచాయి. అవే హిమాలయ పర్వతాలు అయ్యాయి. ఇప్పటికీ ఆ రాపిడి జరుగుతూనే ఉంది. ఇండియా ఇప్పుడు సంవత్సరానికి 2 సెంటీమీటర్లు ఈశాన్యం వైపుకి జరుగుతోంది. ఇలా కదులుతున్నప్పుడు ఈ భూకంపాలు వస్తున్నాయి.