కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కోచింగ్ సెంటరులో 555 మంది విద్యార్థులను ఉంచిన యజమానిని పోలీసులు అరెస్టు

 


 కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కోచింగ్ సెంటరులో 555 మంది విద్యార్థులను ఉంచిన యజమానిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలోని జస్దాన్ పట్టణంలో జరిగింది. రాజ్‌కోట్ జిల్లాలోని జస్దాన్ పట్టణంలోని జయసుఖ్ సంఖల్వాగా కోచింగ్ సెంటరుపై పోలీసులు దాడి చేయగా కరోనా నిబంధనలకు విరుద్ధంగా 555 మంది విద్యార్థులను ప్రాంగణంలో ఉంచారని తేలిందని రాజ్ కోట్ ఎస్పీ బలరామ్ మీనా చెప్పారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన జయసుఖ్ పై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు.


కోచింగ్ సెంటరులోని విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్పీ పేర్కొన్నారు.జవహర్ నవోదయ విద్యాలయ, బాలచాడి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సంకల్వ కోచింగ్ సెంటర్-కమ్-హాస్టల్ నడుపుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.9 నుంచి 10 ఏళ్ల వయసు గల విద్యార్థులు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా తరగతుల్లో ఉన్నారని వెల్లడైంది.