6 కోట్ల మంది కస్టమర్లకు రూ.49 రీచార్జ్‌ ప్యాక్‌ను ఒకసారి ఉచితం

 


కోవిడ్‌–19 విపత్తు వేళ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. తక్కువ ఆదాయమున్న 6 కోట్ల మంది కస్టమర్లకు రూ.49 రీచార్జ్‌ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా ఇవ్వనుంది. 28 రోజుల కాలపరిమితి గల ఈ ప్యాక్‌ కింద రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా అందుకోవచ్చు.


ఇక ఈ ప్రయోజనాల విలువ రూ.294 కోట్లు అని కంపెనీ వెల్లడించింది. అలాగే రూ.79 రీచార్జ్‌ ప్యాక్‌పై రూ.128 టాక్‌టైం, 200 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది.