నికర అమ్మకాలు రూ. 63 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ. 64.25 కోట్లకు

 


ఆర్థిక సంవత్సరం(2020-21)లో మార్చితో ముగిసిన త్రైమాసికంలో తెలంగాణకు చెందిన విత్తన సంస్థ కావేరీ సీడ్స్‌ రూ. 17.77 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలానికి కంపెనీ రూ. 7.57 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.


నికర అమ్మకాలు రూ. 63 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ. 64.25 కోట్లకు చేరినట్లు సంస్థ సీఎండీ జీవీ భాస్కర్‌ రావు తెలిపారు. అయితే మొత్తంమీద... గత ఆర్థిక సంవత్సరానికి రూ. 1036 కోట్ల నికర అమ్మకాలపై రూ. 311.2 కోట్ల లాభాన్ని సంస్థ ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే లాభంలో 19.74 శాతం పెరుగుదల నమోదైంది.