మే 7వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు రంజాన్ సెలవులు

 


 గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా ఈద్ అల్ ఫితర్(రంజాన్) సెలవులను అధికారికంగా ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు రంజాన్ సెలవులు ఇచ్చింది. కాగా, ప్రైవేట్ సెక్టార్ మాత్రం మే 12 నుంచి 15 వరకు మాత్రమే సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికైతే రంజాన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా కచ్చితంగా తెలియదు. చంద్రవంక కనిపించే దానిబట్టి పండుగ ఉంటుంది. ఈ నెల 12న లేదా 13న ఈద్ అల్ ఫితర్ ఉండొచ్చని చాలా ముస్లిం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అటు యూఏఈ కూడా మే 11 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ యూఏఈ వెల్లడించింది.