మిషన్ ఇంపాజిబుల్ 7'లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారారు. 'రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్' సినిమాలు సెట్స్‌పై ఉంటే, మరికొన్నిచర్చల దశలో ఉన్నాయి. కాగా ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే, ప్రభాస్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారట. వివరాల్లోకెళ్తే.. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రంలో టామ్ క్రూజ్‌తో కలిసి ప్రభాస్ యాక్షన్ హీరోగా మెప్పించబోతున్నారు. గత ఏడాది 'రాధేశ్యామ్' చిత్రం కోసం ప్రభాస్ ఇటలీ వెళ్లినప్పుడు డైరెక్టర్ క్రిస్టోఫర్ ప్రభాస్‌ను కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేశారు. అప్పుడు ప్రభాస్ ఓకే చెప్పడమే కాకుండా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారని నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలపై ప్రభాస్ అండ్ టీమ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రం మే 27, 2022లో విడుదలకానుంది.