ఓటీటీలో '99 సాంగ్స్' మూవీ రిలీజ్

 


ఓటీటీలో '99 సాంగ్స్' మూవీ రిలీజ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. విశ్వేష్‌ కృష్ణమూర్తి ఇందులో ఇహాన్ భట్‌, ఎడిల్‌సీ జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్‌.రెహమాన్ సంయుక్తంగా రూపొందించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.