సిద్దిపేట మున్సిపాలిటీలో కారు జోరుసిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. గులాబీ జెండా ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 43 వార్డులకు గానూ ఇప్పటి వరకు 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ పన్నెండు వార్డుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు.


-1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల మెజారిటీతో గెలుపు

-2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీతో గెలుపు

-3వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి 721 ఓట్ల మెజారిటీతో గెలుపు

-4 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత 612 ఓట్ల మెజారిటీతో గెలుపు

-5 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ 570 ఓట్ల మెజారిటీతో గెలుపు

-6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయికుమార్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపు

-7వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవీ 573 ఓట్ల మెజారిటీతో గెలుపు

-8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత 411 ఓట్ల మెజార్టీతో గెలుపు

-9వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజార్టీతో గెలుపు

-10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజార్టీతో గెలుపు

-11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు

-12వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా శ్రీనివాస్ యాదవ్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపు