పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబాటుదారుడిని బార్డర్ సెక్యూరిటీ పోలీసులు ....

 


జమ్మూకశ్మీరులోని అంతర్జాతీయ సరిహద్దు అయిన సాంబా సెక్టారు వద్ద పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబాటుదారుడిని బార్డర్ సెక్యూరిటీ పోలీసులు కాల్చి చంపారు. గురువారం తెల్లవారుజామున 2.35 గంటలకు పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశిస్తుండగా పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. పాక్ చొరబాటుదారుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ సరిహద్దు వద్ద మే 3వతేదీన పాక్ నుంచి ఓ వ్యక్తి చొరబడుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చిచంపారు. ఫిబ్రవరి 25వతేదీ నుంచి సరిహద్దుల్లో పాక్ కాల్పులను విరమించగా, ఆ దేశం నుంచి తరచూ మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నిస్తుండటం విశేషం. పాక్ అక్రమ చొరబాటుదారులతో సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు.