దక్షిణాది చిత్రాల్లో కథానాయికగా జాన్వీకపూర్‌ అరంగేట్రం

 


దక్షిణాది చిత్రాల్లో కథానాయికగా జాన్వీకపూర్‌ అరంగేట్రంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఆమె మహేశ్‌బాబు సరసన కథానాయికగా నటించబోతున్నారని తాజా సమాచారం. మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో మూడో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై త్రివిక్రమ్‌ దృష్టి సారించార ని సమాచారం. ఈ చిత్రంలో మహేశ్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఒక హీరోయిన్‌గా పూజాహెగ్డేను ఖరారు కాగా, మరో కథానాయిక కోసం అన్వేషణలో ఉన్నారట. దీనికోసం శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. మహేశ్‌తో సినిమా అయితే తెలుగులో లాంచింగ్‌ గ్రాండ్‌గా ఉంటుందని భావించిన జాన్వీ కూడా దాదాపు అంగీకరించారట. హారికా హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌తో మహేశ్‌ 'సర్కారు వారి పాట చిత్రీకరణ వాయిదా పడింది. సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 31న 'సర్కారు వారి పాట' చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదలచేయనున్నట్టు సమాచారం.