గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 


గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 4 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 137 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్ ఫిట్టర్‌, ఎలక్ట్రికల్ మెకానిక్‌, కమర్షియల్ అసిస్టెంట్‌, టెక్నికల్ అసిస్టెంట్ (క్యూఏ), అన్‌స్కిల్డ్‌, ఎఫ్ఆర్‌పీ లామినేటర్‌, ఈఓటీ క్రేన్ ఆపరేటర్‌, వెల్డర్‌, స్ట్రక్చురల్ ఫిట్టర్‌, నర్స్‌, టెక్నికల్ అసిస్టెంట్ (కమర్షియల్‌, స్టోర్స్‌), ట్రైనీ ఖలాసీ వంటి పోస్టులు ఉన్నయి.

మొత్తం పోస్టులు: 137

ఇందులో జనరల్ ఫిట్టర్ 5, ఎలక్ట్రికల్ మెకానిక్ 1, కమర్షియల్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 3, అన్‌స్కిల్డ్ 25, ఎఫ్ఆర్‌పీ లామినేటర్ 5, ఈఓటీ క్రేన్ ఆపరేటర్ 10, వెల్డర్ 26, స్ట్రక్చురల్ ఫిట్టర్ 42, నర్స్ 3, టెక్నికల్ అసిస్టెంట్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు: రూ.200

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 4

వెబ్‌సైట్‌: www.goashipyard.in