ఈ రోజుల్లో హీరోయిన్లకు పెళ్లి అయిపోతే చాలు కెరీర్ కు శుభం కార్డ్

 


ఈ రోజుల్లో హీరోయిన్లకు పెళ్లి అయిపోతే చాలు కెరీర్ కు శుభం కార్డ్ పడిపోయినట్లే. ఇంకా చెప్పాలంటే శుభం కార్డు పడిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు. కానీ సమంత మాత్రం డిఫెరెంట్. పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగించడం కష్టమే అనుకున్న వాళ్లకు తప్పు అని నిరూపిస్తుంది. దానికి తానే బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ఒకవేళ కొనసాగించినా స్టార్ హీరోయిన్ గా ఉండలేరు అంటూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అపోహలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసింది సమంత. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈమె క్రేజ్ అలాగే ఉంది. మార్కెట్ ఎక్కడా డౌన్ కాలేదు. లాక్ డౌన్‌లో కూడా డౌన్ కాకుండా జాగ్రత్త పడుతుంది ఈమె. ముఖ్యంగా లాక్ డౌన్ మొదలయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు మాత్రం చేరువగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది.


దాంతో పాటు ఇంటి పైనే గార్డెనింగ్ చేసి మరింత పాపులర్ అయింది. ఇదిలా ఉంటే ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలను పక్కనబెట్టేసి బిజినెస్ లో బిజీ అవుతుంది. సాకీ డ్రెస్ బ్రాండ్ ప్రచారం.. స్కూల్ బిజినెస్ అంటూ కొత్త కొత్త వ్యాపకాలపైకి ఫోకస్ చేస్తుంది సమంత. ఇలాంటి సమయంలోనే డిజిటల్ మీడియాపై కూడా దృష్టి పెట్టింది సమంత. ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇది త్వరలోనే స్ట్రీమ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. చెన్నై నేపథ్యంలో సాగే డ్రామా కావడంతో సమంతను తీసుకున్నారు దర్శక ద్వయం రాజ్ డికే. ట్రైలర్ లోనూ సమంతకు బాగానే స్కోప్ ఇచ్చారు. నేను వాళ్లను చంపేస్తానంటూ తమిళంలో చెప్తుంది సమంత. టెర్రరిస్ట్ పాత్రలో రప్ఫాడించింది.


ఇదిలా ఉంటే ఈ సిరీస్ ట్రైలర్ చూసిన తర్వాత రా రమ్మంటూ బాలీవుడ్ నుంచి సమంతకు అవకాశాలు మొదలైపోయాయి. అంతెందుకు సమంత ఒప్పుకుంటే ఆమెతో బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధమే అంటూ ది ఫ్యామిలీ మెన్ 2 దర్శకులు రాజ్ డికే చెప్తున్నారు. మరోవైపు అక్కడి దర్శక నిర్మాతలు కూడా అక్కినేని కోడలి కోసం చూస్తున్నారు. మరి సమంత అటు వైపు అడుగులు వేస్తుందో లేదంటే ఫ్యామిలీ మెన్ వరకు మాత్రమే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోతుందో చూడాలి.