'మైక్రోసాఫ్ట్‌, నిర్మాణ్‌’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు పలు సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచితంగా ఆన్‌లైన్‌ శిక్షణ

 'మైక్రోసాఫ్ట్‌, నిర్మాణ్‌’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు పలు సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచితంగా ఆన్‌లైన్‌ శిక్షణనిచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. 2018-2021 మధ్యలో బీటెక్‌, ఎంటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంసీఏ, కంప్యూటర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ పట్టభద్రులకు 'మైక్రోసాఫ్ట్‌ డాట్‌ నెట్‌’ కోర్సులో 'సి.నెట్‌, ఏఎస్‌పీ.నెట్‌, ఏడీవో.నెట్‌, హెట్‌ఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, ఎస్‌క్యూల్‌.సర్వర్‌, జావా స్క్రిప్ట్‌, ఎక్స్‌ఎంఎల్‌ + ఎక్స్‌ఎస్‌ఎల్‌టీ, జే క్వెరీ, సాఫ్ట్‌ స్కిల్స్‌, వర్క్‌ ప్లేసెస్‌ రెడీనెస్‌, విత్‌ రియల్‌ టైమ్‌ ప్రాజెక్ట్‌’లు, 'వెబ్‌ అప్లికేషన్‌’ డెవలప్‌మెంట్‌లో 'యాంగ్యులర్‌ జేఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, జావా స్క్రిప్ట్‌, మై ఎస్‌క్యూఎల్‌, ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌, పీహెచ్‌పీ, సాఫ్ట్‌ స్కిల్స్‌, వర్క్‌ ప్లేసెస్‌, రెడీనెస్‌’ వంటి పలు కోర్సుల్లో శిక్షణ ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ లోపు https://bit.ly/RegistrationLinkFRYSP లింక్‌ ద్వారా తమ దరఖాస్తులు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 91008 10928 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.