బంగారం ధర స్థిరం

 


బంగారం ధరల లో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర స్థిరంగానే ఉంది. కానీ వెండి ధరలు మాత్రం తగ్గాయి. మూడు రోజుల నుండి వెండి రేటు తగ్గుతూనే వుంది. ఇది ఇలా ఉంటే బంగారం ధరలు ఎలా వున్నాయి అనే విషయం లోకి వెళితే..


శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర నిలకడగానే ఉంది. అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఏ మాత్రం మారలేదు. రేటు రూ.49,750 వద్దనే ఉంది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారి లో నడిచింది. అది కూడా రూ.45,600 వద్ద నిలకడగా వుంది. అదే వెండి గురించి చూస్తే.. వెండి ధర రూ.500 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,400కు పడిపోయింది.


అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర నిలకడ గానే ఉంది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1881 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధరలు అయితే ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలైన కారణాల మీద ఆధార పడతాయి అన్న విషయం తెలిసినదే.