మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం నేడుఅంతరిక్షంలో నేడు జరగబోయే అద్భుతాన్ని చూడాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరపు మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం నేడు రాబోతోంది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ (ఎర్ర చందమామ) అంటున్నారు. ఎందుకంటే... చంద్రగ్రహణం సమయంలో... చందమామ... ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... సూర్యుడికీ చందమామకూ... మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు... సూర్యకిరణాలు... చంద్రుడిపై పడవు. ఆ సమయంలో... గ్రహణం ఏర్పడుతుంది. ఐతే... సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగు కిరణాలు... భూమి నుంచి ముందుకు దూసుకెళ్తాయి. అవి చందమామపై ప్రసరిస్తాయి. అందువల్ల చందమామ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇలాంటిది 2019 జనవరి 21న వచ్చింది. మళ్లీ ఇప్పుడే వస్తోంది.


ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం.. తూర్పు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్ర దీవులు, ఉత్తర అమెరికాలో బాగా కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రంలో కొన్ని చోట్ల కనిపిస్తుంది. హిందూ మహా సముద్ర దీవుల్లోనూ కనిపిస్తుంది. భారతీయులకు ఇది పాక్షికంగా కనిపిస్తుంది.


ఇండియా టైమ్ ప్రకారం ఇవాళ

మధ్యాహ్నం 3.15కి చంద్రగ్రహణం మొదలవుతుంది.

సాయంత్రం 4.39కి సంపూర్ణం అవుతుంది. అప్పుడు చందమామ పూర్తిగా కనిపించదు.

సాయంత్రం 4.58కి చంద్రగ్రహణం వదిలేసే ప్రక్రియ మొదలవుతుంది. మెల్లగా చందమామ రింగులా కనిపిస్తుంది.

సాయంత్రం 6.23కి చంద్రగ్రహణం పూర్తిగా తొలగిపోయి... సంపూర్ణ చందమామ కనిపిస్తుంది.


ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలతో ఇండియాకి సంబంధం ఉంటుంది. అవి

మే 26 - సంపూర్ణ చంద్ర గ్రహణం.

జూన్ 10 - వార్షిక సూర్య గ్రహణం

నవంబర్ 19 - పాక్షిక చంద్రగ్రహణం

డిసెంబర్ 4 - సంపూర్ణ సూర్య గ్రహణం


12 రాశులపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. సాధారణంగా... చందమామ వల్ల వివిధ రాశుల వారికి మానసిక ఆనందం కలుగుతుంది. అదే చందమామకు గ్రహణం పడితే... ఆ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఐతే... ఇండియాలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించదు కాబట్టి... అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.


ఈ రోజున గ్రహణం సమయంలో ఉపవాసం చేయడం మంచిదే అంటున్నారు నిపుణులు. గర్భిణీ స్త్రీలు ఇళ్లలోంచీ బయటకు వెళ్లవద్దనీ... గ్రహణం నీడ మీద పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే... కత్తులు ఇతర పదునైన వస్తువులను గ్రహణ సమయంలో వాడవద్దని సూచిస్తున్నారు. అలాగే గ్రహణం సమయంలో... కొత్త కార్యక్రమాలు ఏవీ ప్రారంభించవద్దని చెబుతున్నారు.