ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రామాయణం ఇతిహాసం

 


ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రామాయణం ఇతిహాసం ఆధారంగా పలు చిత్రాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే చిత్రం తెరకెక్కుతుండగా, ఇందులో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న సీతలో రావణుడు ఎవరనే దానిపై కొన్నాళ్ల నుండి ఆసక్తికర చర్చ నడుస్తుంది. దర్శకుడు అలౌకిక్ దేశాయ్ సీత కోణం నుండి రామాయణం చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఇందులో సీత పాత్రకు కరీనా కపూర్‌ లేదా ఆలియా భట్‌లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.


తాజాగా రావణుడి పాత్రకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పద్మావత్ చిత్రంలో ప్రతినాయకుడిగా అదరగొట్టిన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో రావణుడిగా నటిస్తే బాగుంటుందని మేకర్స్ అతనిని ఎంపిక చేసినట్టు ప్రచారం నడుస్తుంది. మరి ఇందులో ఎంత ఉందనేది రానున్న రోజులలో తేలనుంది.