కష్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త డిస్కౌంట్స్ : ఫ్లిప్ కార్ట్

 


: ప్రముఖ ఈ-కామర్స్ సంప్థ ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. తమ కష్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త డిస్కౌంట్స్ అందించేందుకు సిద్ధమైంది. అందుకోసమే “ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ ” పేరుతో ఆఫర్లను ప్రారంభించింది, ల్యాప్‌టాప్‌లు, టీవీలు ,ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది ఫ్లిప్ కార్ట్.


ఈ ఆఫర్ మే 2 తేదీ నుంచి మే 7వతేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఆపిల్, శామ్‌సంగ్, షియోమీ, రియల్-మీ వంటి సంస్థల వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ తీసుకువచ్చింది. హెచ్డీఎఫ్సి బ్యాంకు కస్టమర్లు 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 అంగుళాల ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే కలిగిన ఆపిల్ ఐఫోన్ 11 రూ.7,000 తగ్గింపుతో అందించనున్నారు.

    

శామ్ సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ. 2 వేల వరకు తగ్గింపు లభించనుంది. 6GB + 64GB వేరియంట్ వాస్తవ ధర రూ. 14,999 కాగా, రూ. 12,999కే అందుబాటులో ఉంది.


ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 4ఎ రూ.31,999 విలువ చేసే ఫోన్ 15 శాతం తగ్గింపుతో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తోంది. ఆఫర్ కింద ధర రూ.26,999 లభిస్తుంది. మైక్రో మాక్స్ ఇన్ 1 మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ను కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు.