అమెజాన్ కంపెనీ మరో ముందడగు .. మీడియా కంపెనీని కొనుగోలు

 


అమెజాన్ కంపెనీ మరో ముందడగు వేసింది. అమెరికాకు చెందిన ఓ మీడియా కంపెనీని కొనుగోలు చేసింది. సినిమాల నిర్మాణంలో శతాబ్ద కాలం అనుభవం ఉన్న కంపెనీని సొంతం చేసుకుంది. ఆ కంపెనీ లైబ్రెరీలో ప్రసిద్దిగాంచిన పెద్ద చిత్రాలు వారి వద్ద ఉన్నాయి. అంతే కాదు ఆ కంపెనీలో ఇప్పటికే నాలుగు అంకెల సంఖ్యలో నమోదు చేసుకున్న సినిమా టైటిళ్లు ఉన్నాయి. మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ (ఎమ్‌జీఎమ్‌) ను 8.45 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.63,300 కోట్లు)తో అమెజాన్‌ కొనుగోలు చేయనుంది. ఆ మేరకు రెండు కంపెనీలు ఒక విలీన ఒప్పందం(MoU)పై బుధవారం సంతకాలు చేశాయి.


సినిమాల నిర్మాణంలో దాదాపు 100 సంవత్సార అనుభవం ఉన్న ఈ స్టూడియో వద్ద 4,000కు పైగా సినిమా టైటిళ్లు ఉన్నాయి. అంతేకాదు అందులో '12 ఆంగ్రీ మెన్‌', 'బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌', 'క్రీడ్‌', 'జేమ్స్‌ బాండ్‌', 'లీగల్లీ బ్లాండ్‌', 'మూన్‌స్ట్రక్‌', 'రేజింగ్‌ బుల్‌', 'రాకీ', 'సైలెన్స్‌ ఆఫ్‌ ద లాంబ్స్‌', 'టోంబ్‌ రైడర్‌', 'ద మాగ్నిఫిషియంట్‌ సెవెన్‌', 'ద పింక్‌ పాంథర్‌' వంటివెన్నో ఆ కంపెనీ లైబ్రరీలో ఉన్నాయి.


అంతే కాదు 'ఫార్గో', 'ద హ్యాండ్‌మెయిడ్స్‌ టేల్‌', 'వికింగ్స్‌' వంటి 17,000కు పైగా టీవీ షోలూ ఉన్నాయి. వీటికి 180కి పైగా అకాడమీ అవార్డులు, 100కు పైగా ఎమ్మీస్‌ అవార్డులు వచ్చినట్లు ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ స్టూడియోస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ హాప్కిన్స్‌ పేర్కొన్నారు.


ఎమ్‌జీఎమ్‌ వద్ద ఉన్న విస్తృత స్థాయిలో ఉన్న ఈ నిధిని ఆ కంపెనీ బృందంతో కలిసి అభివృద్ధి చేయనున్నాట్లుగా ఆ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ హాప్కిన్స్‌ పేర్కొన్నారు . అత్యంత నాణ్యమైన కథలను చెప్పడానికి మాకు మరిన్ని అవకాశాలు వచ్చినట్లేందని ఆయన అభిప్రయా పడ్డారు.


కాగా, ఈ లావాదేవీకి నియంత్రణపరమైన అనుమతులు, ఇతరత్రా ఆమోదాలు లభించాల్సి ఉంది. కరోనా సమయంలో ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌ వంటి ఓటీటీలకు మరింత ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే.