క్రీడాకారుల జాబితాను సిద్ధం చేసి వారికి లాల్‌బహదూర్‌ స్టేడియంలో టీకా కా.....

 


తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ పర్యవేక్షణలో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న క్రీడాకారులు సాయిప్రణీత్, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలతోపాటు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇతర క్రీడాకారులతో ఆయన మాట్లాడారు.


సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్రీడాకారులకు కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని.... క్రీడాకారుల జాబితాను సిద్ధం చేసి వారికి లాల్‌బహదూర్‌ స్టేడియంలో టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలలో జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.