ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్ తోపాటు ఇద్దరు పాఠశాల ఉపాధ్యాయులను డిస్మిస్

 

ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్ తోపాటు ఇద్దరు పాఠశాల ఉపాధ్యాయులను డిస్మిస్ చేస్తూ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు రవాణ సదుపాయం కల్పించిన ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్ తో పాటు బషీర్ అహ్మద్ షేక్, ముహ్మద్ యూసుఫ్ గానీలనే ఉపాధ్యాయులను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. వీరు ముగ్గురు పాక్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దర్యాప్తులో తేలింది.