గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

 


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాగల నాలుగు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో గరిష్ఠంగా 38.9డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠంగా 25.5డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.