వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోరు

 


వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే చిత్రం చేస్తున్న పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలోను ఓ సినిమా చేయనున్నాడు. అయితే బండ్ల గణేష్‌తో పవన్ సినిమా ఉంటుందని కొద్ది రోజులుగా గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని బండ్ల కూడా కన్‌ఫాం చేశాడు.


పవన్ – బండ్ల గణేష్ సినిమాకు ఖిలాడి చిత్ర దర్శకుడు రమేష్ వర్మ అంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా ఫైనల్ అయ్యాక నేనే అఫీషియల్‌గా ప్రకటిస్తాను అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.