ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అంచనాలు


ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అంచనాలు మిన్నంటేలా చేస్తున్నాయి. ఊహించని విధంగా కొన్ని కాంబోస్ సెట్ అవుతుండడంతో ఫ్యాన్స్ వీటిపై ఆసక్తి చూపుతున్నారు
. ఇటీవల త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అంతా ఊహించారు. కాని కొరటాల శివతో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పి ఊహించని షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్. దీంతో త్రివిక్రమ్ సినిమాపై అనుమానాలు నెలకొన్నాయి.


తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను మహేష్‌తో చేయనున్నాడని తెలుస్తుంది. ఈ రోజు ఏ సమయంలో అయినా ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ఉండొచ్చని టాక్. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ ముగించాక త్రివిక్రమ్ తో కలిసి మూవీ చేయనున్నాడని తెలుస్తుంది.