'బ్యాన్‌ రాధే' అనే హ్యాష్‌ట్యాగ్‌ మెయింటైన్‌

 


బాలీవుడ్‌లో ఓ సినిమా విడుదలవుతోంది అంటే… పొగుడుతూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌, తిడుతూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ సిద్ధమైపోతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా పరిస్థితి ఇలా ఉంటుంది. దాని వల్ల జనాలు సినిమాలు చూడటం మానేస్తారా అంటే అదీ లేదు. తాజాగా ఇదే పరిస్థితి సల్మాన్‌ ఖాన్‌ 'రాధే'కి ఎదురైంది. ఓటీటీలో పే పర్‌ వ్యూగా 'రాధే' నిన్న విడుదలైంది. దీంతో చాలామంది విష్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆ క్రమంలో మరో హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. అదే 'బ్యాన్‌ రాధే'.


బాలీవుడ్‌లో తరచుగా వినిపించే ఉద్యమం 'నెపోటిజం'. కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తున్నారంటూ ఓ నినాదం రేగుతూ ఉంటుంది. ఓ స్టార్‌ హీరోయిన్‌ వీటికి వత్తాసు పలుకుతూ ఉంటుంది. ఇప్పుడు అదే పేరుతో 'బ్యాన్‌ రాధే' అనే హ్యాష్‌ట్యాగ్‌ మెయింటైన్‌ చేస్తున్నారట. అందులో సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ మద్దతుదారులు కూడా చాలామంది ఉన్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారట.